లెబనాన్‌కు అండగా భారత్..

by  |
లెబనాన్‌కు అండగా భారత్..
X

దిశ, వెబ్‌డెస్క్: లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఇటీవల భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో సుమారు 170మంది మృతిచెందగా, 6వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో ఆ దేశం ఆర్థికంగా కుంగిపోయింది. ఈ నేపథ్యంలోనే లెబనాన్‌కు సాయం అందించేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా అందులో భారత్ కూడా చేరింది.

లెబనాన్‌కు 58 మెట్రిక్ టన్స్ ( 58 వేల కిలోల) ఆహారం, వైద్య పరికరాలను భారత్ సరఫరా చేస్తోంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అధికారికంగా వెల్లడించారు. ‘లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో జరిగిన నష్టానికి చింతిస్తున్నాం, ఆ దేశం తిరిగి కోలుకునేందుకు మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగా ఆహారం, కావలసిన వైద్య పరికరాలు లెబనాన్‌కు పంపుతున్నాం. దాదాపు 58 మెట్రిక్ టన్నుల సామగ్రితో వాయుసేన సీ17 విమానం బీరూట్ బయలుదేరిందని’ జైశంకర్ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, లెబనాన్ ప్రమాదం ప్రపంచ దేశాలను దిగ్బ్రాంతికి గురించేగా, చాలా దేశాలు మానవతా థృక్పధంతో ఆ దేశానికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి(UNO)తో పాటు వివిధ దేశాలు లెబనాన్‌కు మద్దతుగా నిలిచాయి.


Next Story

Most Viewed