- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనా విలయతాండవం… ఒక్కరోజులోనే 56,211 కేసులు నమోదు

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలము చేస్తుంది. వరుసగా 20వ రోజు కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక్క రోజులో కొత్తగా మరో 56,211 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,95,855లకు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు 271 చోటుచేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. దీంతో మొత్తం మరణాలూ 1,62,114లకు చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,40,720కు చేరాయి.
56,211 కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 31,643 నమోదయ్యాయి. ఆరు రాష్ట్రాల్లోనే 78.56శాతం కేసులు నమోదయ్యాయని, ఇందులో మహారాష్ట్రతోపాటు పంజాబ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్‌లున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్రలోనే 62 శాతం ఉన్నాయి.
Next Story