విదేశీ కరోనా టీకాలపై దిగుమతి సుంకం రద్దు యోచనలో కేంద్రం

by Harish |
విదేశీ కరోనా టీకాలపై దిగుమతి సుంకం రద్దు యోచనలో కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు, వచ్చే నెల నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా అందించాలనే నిర్ణయం నేపథ్యంలో విదేశీ కరోనా టీకాలను తక్కువ ధరలు లభ్యమయ్యేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టీకాలపై సుంకాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కరోనా టీకాలపై 10 శాతం సుంకాన్ని మాఫీ చేసే అవకాశం ఉంది. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌లు వచ్చే నెలలోపు భారత్‌కు రానున్నాయి.

దీంతోపాటు జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా కంపెనీలు తమ టీకాలను అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రస్తుతం విదేశీ టీకాల దిగుమతిపై 10 శాతం కస్టమ్స్ సుంకంతో పాటు ఐజీఎస్టీ, అదనంగా సోషల్ వెల్ఫేర్ ఛార్జీలు 16.5 శాతం వరకు ఉన్నాయి. దీనివల్ల దేశీయ టీకాల కంటే విదేశీ టీకాలు ఖరీదెక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో విదేశీ టీకాలపై దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని కేంద్ర భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story