- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ‘ఇండియన్ ఫుట్‌వేర్ సైజింగ్ సిస్టం’.. సీఎల్ఆర్ఐ దేశవ్యాప్త సర్వే
దిశ, ఫీచర్స్: షూ లేదా చెప్పుల సైజ్ చార్ట్‌ను ఎప్పుడైనా పరిశీలించారా? లేకుంటే ఈసారి గమనించండి. ఫుట్‌వేర్, ఫ్యాషన్ ఈ కామర్స్ సైట్స్‌లో మనం ఎంపిక చేసిన షూ, చెప్పులు, శాండిల్స్ ఏవైనా కొనుగోలు చేయాలంటే ‘సైజ్’ తప్పనిసరిగా అడుగుతుంది. ఆ సైజ్ చార్ట్‌లో ‘ఈయూ’ ‘యూకే’ లేదా ‘యూఎస్’ పరిమాణాలను చూపిస్తోంది. అందులో మన ఇండియా పేరు కనిపించినా..విదేశాల సైజ్ చార్ట్‌ను పోల్చుతూ, మన సైజ్ నిర్ణయిస్తారు. అంతేగానీ ఇప్పటివరకు మనకంటూ ‘ఫుట్‌వేర్ సైజింగ్ సిస్టమ్’ లేదు. ఈ నేపథ్యంలో సిఎస్ఐఆర్-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎల్ఆర్ఐ) ఆధ్వర్యంలో ‘పాన్ ఇండియా ఫీట్ స్కానింగ్ సర్వే’ నిర్వహిస్తోంది. ఈ డేటా ఆధారంగా ‘ఇండియన్ ఫుట్‌వేర్ సైజ్ స్టాండర్డ్స్’ నిర్వచించనున్నారు. తద్వారా వచ్చే ఏడాది నాటికి ఇండియాకు ఓ ప్రత్యేక ‘ఫుట్‌వేర్ సైజింగ్ సిస్టం’ రాబోతుంది.
దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా భారత్‌లో బ్రిటీష్ కాలం నాటి చట్టాలే అమల్లో ఉండగా, బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో..ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలను తీసుకురావడానికి ‘కేంద్రం’ ప్రయత్నిస్తోంది. చట్టంలోనే కాదు, చాలా విషయాల్లో మనం ఇప్పటికీ ఆంగ్లేయులు రూపొందించిన పద్ధతులనే ఫాలో అవుతున్నాం. ఈ క్రమంలో ఇండియాకు ఇప్పటివరకు సొంత పాదరక్షల పరిమాణ వ్యవస్థ లేదు. స్వాతంత్ర్యానికి ముందు ఆంగ్లేయులు ‘ఇంగ్లిష్ సైజెస్’ ప్రవేశపెట్టారు, అవి ఇప్పటికీ అనుసరిస్తున్నాం. ఇంగ్లిష్ సైజ్ సిస్టం ప్రకారం మ్యానుఫ్యాక్చరర్స్, దానికి సమానమైన యూరోపియన్, అమెరికన్ పరిమాణాలను పేర్కొంటున్నారు. ఈ యూకే సైజ్ చార్ట్ ప్రకారం సగటు భారతీయ మహిళ 4 – 6 మధ్య పాదరక్షల పరిమాణాలను ధరిస్తుండగా, సగటు పురుషుడు 5-11 మధ్య పరిమాణాలను ఉపయోగిస్తున్నాడు.
పాదరక్షల రూపకల్పన అంత సులభం కాదు. వీటి తయారీకి సైంటిఫిక్(శాస్త్రీయ), ఇంజినీరింగ్ నైపుణ్యం అవసరం. సరైన పరిమాణపు పాదరక్షలతో మాత్రమే పాదాలకు సరైన సౌకర్యముంటుంది. కాస్త ఫిట్‌గా ఉన్నా రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడొచ్చు. అంతేకాదు పాదాల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతినొచ్చు. బ్యాడ్ ఫిట్స్ గాయాలకు కారణమవుతుండగా, ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన వారిలో మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇతర దేశాల సైజ్ చార్ట్‌ల ప్రకారం రూపొందించిన పాదరక్షలు మన ఇండియన్స్ ఫుట్ వేరర్స్‌కు సరిపోకపోవచ్చు. ఇండియన్స్ ఫీట్ క్యారెక్టర్‌స్టిక్స్.. యూరోపియన్లు లేదా అమెరికన్ల లక్షణాలకు భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 1969లో పుట్‌వేర్ పరిమాణ విషయంలో ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ (IS 1638-1969)కు తెలిపింది. అప్పటి నుంచి ఇండియన్ ఫీట్ పరిమాణానికి అనుగుణమైన మార్పులు వచ్చాయి. ‘పాదరక్షల పరిమాణాల గురించి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి రైట్ ఫిట్స్, కంఫర్ట్ ఫిట్స్ ఎంతో అవసరం. భారతీయ వినియోగదారులకు వీటి గురించి అవగాహన కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని సిఎస్‌ఐఆర్-సిఎల్‌ఆర్‌ఐ చీఫ్ సైంటిస్ట్ ఎండి సాదిక్ అన్నారు.
రీజనల్ వేరియేషన్స్
భారతదేశం విశాలమైన దేశం మాత్రమే కాదు, భిన్నత్వంలో ఏకత్వానికి నిలువెత్తు నిదర్శనం. అసేతు హిమాచలం సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో వైరుధ్యాలు ఉన్న విషయం తెలిసిందే. భారత్‌లో ప్రాంతీయ వైవిధ్యత ఉంటుంది. దీని కారణంగా పాదరక్షల పరిమాణాలను ప్రామాణీకరించడం కష్టమైన పనే. కొన్ని అధ్యయనాల ప్రకారం..ఈశాన్య ప్రజలు పరిమాణంలో చిన్న పాదాలు కలిగి ఉంటే, ఓవరాల్‌గా భారతీయుల పాదాలను పరిశీలిస్తే పాదాలు కాస్త పెద్దవిగా ఉంటాయి. కాబట్టి ఇండియన్స్ తమకు అవసరమైన దానికంటే కాస్త పెద్ద పరిమాణాన్ని ఇష్టపడతారు.
ఫుట్‌వేర్ సైజ్ ఎలా నిర్ణయిస్తున్నారు?
తొలిసారి పాన్ ఇండియన్ స్థాయిలో జరుగుతున్న ‘ఆంత్రోపోమెట్రిక్’ సర్వేను సిఎల్‌ఆర్‌ఐ లీడ్ చేస్తుండగా, ఇందులో 3-డి ఫుట్ స్కాన్‌లు, ఫీట్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. జనవరిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్..14 నెలల పాటు కొనసాగనుండగా, 2022లో ‘ఇండియా ఫుట్ వేర్ సైజ్ చార్ట్’ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డిపిఐఐటి)’ మద్దతు ఇస్తుంది. ఇందులో భాగంగా సర్వే బృందాలు భిన్న వయసుల వారి ఫీట్ సైజెస్, క్యారెక్టరస్టిక్స్ ఆధారంగా డేటా బేస్ సేకరించనున్నాయి. దీంతో నిర్దిష్ట పొడవు, వెడల్పుల విషయంలో ఓ స్పష్టతకు రానుండగా, భారత్‌లోని వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, భారతీయుల అవసరాల ఆధారంగా పాదరక్షల పరిమాణ చార్ట్ రూపొందించనున్నారు. ఈ సర్వేలో ఆగ్రా, అహ్మదాబాద్, కోయంబత్తూర్, చెన్నై, జోధ్పూర్, జోర్హాట్, జలంధర్, కాన్పూర్, కోల్‌కతా, ముంబై, పాట్నా, షిల్లాంగ్ చుట్టుపక్కల 94 జిల్లాల్లో సర్వే చేయడంతో పాటు, 3-డి ఫీట్ స్కానర్ యంత్రాలను ఉపయోగించి దాదాపు 1,05,000 నమూనాలను సేకరించనున్నారు.
ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో కలిసి సిఎల్‌ఆర్‌ఐ తమ సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. వేగంగా మారుతున్న జీవనశైలి, నడక శైలి, పాదరక్షల అవసరాలు చూస్తే ప్రతి 7-8 సంవత్సరాలకు ఇలాంటి ఆంత్రోపోమెట్రిక్ సర్వేలు అవసరమవుతాయని సిఎల్‌ఆర్‌ఐ ఆఫీసర్లు వెల్లడించారు. 10 సెకన్లలో, స్కానర్ 30 కొలతలు సంగ్రహిస్తుందని, వీటిలో పాదం పొడవు, వెడల్పుల కొలతలతో పాటు ఆర్క్ యాంగిల్ ఉంటుదన్నారు. చైనా తర్వాత పాదరక్షల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారతదేశం, ఏటా 2,257 మిలియన్ జతలను ఉత్పత్తి చేస్తుంది. దేశీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం 2,021 మిలియన్ జతలు అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం షూ తయారీదారులు ఇంగ్లిష్ (యుకె), ఫ్రెంచ్ (యూరోపియన్), అమెరికన్, మోండోపాయింట్ (జపనీస్) సైజ్ చార్ట్స్ ఉపయోగిస్తున్నారు. ఇక మీదట ఇండియన్ సైజ్ చార్ట్ కూడా రాబోతుందన్న మాట.