- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత కంపెనీల ఆదాయ వృద్ధి 20 శాతం వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: వస్తువుల ధరలు అధికంగా ఉండటం, వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయం 18-20 శాతం పెరుగుతుందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఈ వృద్ధితో కంపెనీల ఆదాయం మొత్తం రూ. 8.2 లక్షల కోట్లకు పెరిగే అవకాశమున్నట్టు క్రిసిల్ పేర్కొంది. దాదాపు 300 కంపెనీల(ఆర్థిక సేవ్లు, చమురు రంగం మినహా) నుంచి సంస్థ వివరాలను సేకరించింది. ఈ కంపెనీలు నిఫ్టీ మార్కెట్ క్యాప్‌లో 55-60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో అవసరమైన ఉత్పత్తుల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం వార్షిక పరంగా 19-21 శాతం పెరిగే అవకాశం ఉంది. ఇక, గతేడాది తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా నిర్మాణ, సంబంధిత రంగాలు గతేడాది కంటే ఈసారి 22-25 శాతం ఆదాయాన్ని సాధించాయి. మొదటి త్రైమాసికంలో కంటే కొవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా డిమాండ్ దెబ్బతిన్నప్పటికీ వినియోగదారు ఉత్పత్తుల నుంచి ఆదాయం 23-25 శాతం పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. పెరిగిన వస్తువుల ధరలతోపాటు మెరుగైన కార్యకలాపాల ద్వారా సమీక్షించిన త్రైమాసికంలో అన్ని రంగాల్లోనూ మెరుగైన ఆదాయం ఉండనుంది. ఐటీ సేవలు, ఫార్మాస్యూటికల్స్ ఆదాయం 4-6 శాతం స్థిరమైన వృద్ధి ఉండనున్నట్టు క్రిసిల్ వెల్లడించింది.