- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విమానాలపై తాత్కాలిక నిషేధం పొడిగింపు?
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచ దేశాలను స్ట్రెయిన్ కరోనా వైరస్ వణికిస్తోంది. దీంతో ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలను రద్దు చేస్తున్నాయి. భారత్ కూడా పలు దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అయితే వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోగా, మరింత విస్తరిస్తుండటంతో అంతర్జాతీయ విమానలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి అంతర్జాతీయ విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దిప్ పురి సింగ్ తెలిపారు. దీర్ఘకాలం కాకపోయినా, స్వల్పకాలంగానైనా నిషేధం పొడిగించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. యూకేలో కొత్త కరోనా వేరియంట్ కనిపించిన నేపథ్యంలో బ్రిటన్, ఇండియాల మధ్య విమానాల రాకపోకపై ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు విధించిన సంగతి తెలిసిందే.
Next Story