వన్డే ర్యాంకింగ్స్‌లో పడిపోయిన టీమిండియా

by Shiva |   ( Updated:2021-05-03 08:21:37.0  )
వన్డే ర్యాంకింగ్స్‌లో పడిపోయిన టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.

వన్డే ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కి నెట్టి న్యూజిలాండ్ తొలి స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ 121 రేటింగ్ పాయింట్లతో టాప్‌లో ఉండగా.. ఆసీస్ 118 పాయింట్లతో రెండో స్థానంలో, 115 రేటింగ్ పాయింట్లతో టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి.

ఇక టీ 20ల్లో 277 పాయింట్లతో ఇంగ్లండ్ తొలి స్థానంలో ఉండగా.. 272 పాయింట్లతో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, ఇండియా మధ్య ఐదు పాయింట్లు మాత్రమే వ్యత్యాసం ఉంది.

Advertisement

Next Story