జీఎస్టీ పరిధిలోకి సహజవాయువు!

by Harish |
జీఎస్టీ పరిధిలోకి సహజవాయువు!
X

దిశ, వెబ్‌డెస్క్: సహజవాయువును వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అదేవిధంగా రాబోయే ఐదేళ్లలో చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 7.5 లక్షల కోట్లను ఖర్చు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడులోని కీలకమైన చమురు, గ్యాస్ ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన మోదీ, 27 దేశాల్లో భారత చమురు, గ్యాస్ కంపెనీలు రూ. 2.70 లక్షల కోట్ల పెట్టుబడులను కలిగి ఉన్నాయన్నారు.

‘ఐదేళ్లలో చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాల కోసం రూ. 7.5 లక్షల కోట్లను ఖర్చు చేయాలని భావిస్తున్నాం. ఇందులో దేశవ్యాప్తంగా 470 జిల్లాలను కలుపుతూ నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్ విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వనున్నాం. సుమారు 65.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతులు జరుగుతున్నాయి. దీన్ని మరింత పెంచే అవకాశం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అంతర్జాతీయ సంస్థలను దేశీయ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామన్నారు. 2030 నాటికి భారత్ తన శక్తిలో 40 శాతం పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేస్తుందని ప్రధాని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed