ఇండియా-జపాన్ నేవీ సంయుక్త శిక్షణ కార్యక్రమం

by  |
ఇండియా-జపాన్ నేవీ సంయుక్త శిక్షణ కార్యక్రమం
X

న్యూఢిల్లీ: చైనాతో లడాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలోనే భారత నేవీ జపాన్‌ నేవీతో కలిసి సంయుక్తంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. ఇండియన్ నేవీ, జపనీస్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్‌తో కలిసి హిందూ మహాసముద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. జపాన్ రక్షణ మంత్రి తారో కోనో, చైనా సైన్యం సామర్థ్యంపైనే కాదు, ఇండో పసిఫిక్ సముద్రజలాల రీజియన్‌పైనా ఆ దేశ దృష్టిపడటంపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రెండు దేశాల సముద్ర రక్షణ బలగాలు ఈ శిక్షణలు జరుపుకున్నాయి. ఆసియాలో చైనా ఆధిపత్య ప్రదర్శన చూపిస్తున్న ఇటీవలి కాలంలో తొలిసారిగా జపాన్ కాస్త కటువుగా మాట్లాడటం గమనార్హం. దక్షిణ చైనా సముద్ర జలాల్లో నెలకొన్న వివాదాలను అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలని పది దేశాలు ఆగ్నేయాసియా దేశాలు ఇదే కాలంలో ఓ స్టేట్‌మెంట్ విడుదల చేయడం గమనార్హం.

చైనాకు సంకేతానికా?

పొరుగుదేశాలతో ఆధిపత్య ధోరణి అనుసరిస్తున్న చైనాకు సంకేతమివ్వడంతోపాటు జపాన్‌తో రక్షణ సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ ఎక్సర్‌సైజులు పనికొస్తాయని దౌత్యవర్గాలు తెలిపాయి. ఈ సమయంలో జపాన్‌తో సంయుక్తంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం కీలకమని వివరించాయి. ఇరుదేశాలకు చెందిన రెండ్రెండు వార్‌షిప్పులతో ఈ ఎక్సర్‌సైజులు జరిగాయి. జపాన్ నేవీ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దది కావడం గమనార్హం.


Next Story

Most Viewed