పబ్జీ గేమ్‌ సహా 118 యాప్‌లపై నిషేధం

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో చైనాకు దిమ్మతిరిగే షాక్‌లు ఇస్తున్న భారత్.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిక్‌టాక్ సహా పలు చైనా యాప్‌లపై భారత్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. పబ్జీ గేమ్‌ను ఎక్కువగా పిల్లలు ఆడుతున్న నేపథ్యంలో దీనిపై గతంలో అనేక ఫిర్యాదులు వచ్చాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కీలకమైన సెక్యూరిటీ, వ్యక్తిగత సమాచారం విషయంలో సైతం గోప్యత పాటించకుండా భారత్‌లోని వ్యాపారాలపై నిఘా పెడుతుందని ఆరోపణలు వెల్లువెత్తడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement