టార్గెట్ తక్కువే : టేలర్

by Shiva |
టార్గెట్ తక్కువే : టేలర్
X

టీమిండియా, కివీస్ మధ్య నిన్న జరిగిన వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ల దూకుడు చూసి భారీ లక్ష్యాన్ని తమ ముందు ఉంచుతుందని అనుకున్నామని.. కానీ మేము అనుకున్న దానికంటే తక్కువే నిర్ధేషించింది అని న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ అన్నారు. ఇండియాను 350 పరుగుల లోపు కట్టడి చేయడమే తమ గెలుపు ఒక కారణమని తెలిపారు. కానీ తమ బౌలర్లు చివర్లో కట్టడి చేయడంతోనే తమ గెలుపు సాధ్యమైందన్నారు. ఇక తమ బ్యాటింగ్‌లో లెఫ్ట్‌-రైట్‌ హ్యాండ్‌ కాంబినేషన్‌ను కొనసాగించడంతో తమకు బౌండరీలను టార్గెట్‌ చేయడం ఈజీ అయ్యిందన్నాడు. టామ్‌ ఇన్నింగ్స్‌తో ఒత్తిడి తగ్గించాడన్నాడు. ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలనే మ్యాచ్‌కు ముందు తమ ఆటగాళ్లతో చెప్పానన్నాడు. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ మాట్లాడుతూ… తమకు పెద్ద లక్ష్యం కనిపించలేదన్నాడు. ‘చాలాకాలం తర్వాత మా ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన వచ్చింది. దీన్ని ఇలానే సిరీస్‌ ఆద్యంతం కొనసాగిస్తాం. మేము భారీ భాగస్వామ్యాలను నమోదు చేశాం. దాంతో చేజింగ్‌ చిన్నదైపోయింది. ప్రధానంగా మంచి ఆరంభం లభించడంతో మేము స్వేచ్ఛగా ఆడే వీలు దొరికింది. కుడి-ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యింది. నిజంగా రాస్‌ టేలర్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ అసాధారణం. కానీ మా బౌలింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు. తదుపరి మ్యాచ్‌కు పూర్తిస్థాయిలో దిగుతామనే ఆశిస్తున్నా’ అని లాథమ్‌ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed