- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND VS ENG: రసవత్తరంగా సాగుతున్న రాంచీ టెస్ట్.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ తడబాటు.. స్కోర్ ఎంతంటే!
దిశ, వెబ్‌డెస్క్: రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ల సాయంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. కీపర్ ధృవ్ జురల్ తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని జురల్ కోల్పోయాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురల్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. 219/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కేవలం 88 పరుగులు జోడించి ఆలౌటైంది. ఈ పరిణామంతో ఇంగ్లండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బ్యాటర్లలో జైశ్వాల్ (73), కుల్దీప్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అదేవిధంగా టామ్ హార్ట్‌లీ మూడు వికెట్లు, జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లను పడగొట్టారు. ఇక రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. వెంటవెంటనే మూడు ప్రధాన వికెట్లను చేజార్చుకుంది. ఇన్సింగ్స్ ఐదో ఓవర్ వేసిన స్పిన్నర్ అశ్విన్ వరుస బంతుల్లో బెన్ డకెట్(15), పోప్(0) పెవిలియన్‌కు సాగనంపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన జోయ్ రూట్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లన కోల్పోయి 95 పరుగులు చేసింది.