- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఫలితంగా… గేమింగ్ యాప్స్ కు పెరిగిన ఆదరణ
దిశవెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశమంతా అప్రమత్తమయ్యింది. ఎక్కడికక్కడ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయి. ప్రజా రవాణా ఆగిపోయింది. వాణిజ్య, ఉత్పాదక కార్యకలాపాలు స్తంభించాయి. కరోనా విజృంభణతో పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. కాలేజీ, స్కూలు విద్యార్థుల పరీక్షలన్నీ కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలొ… ప్రజలంతా ఇల్లకే పరిమితమయ్యారు.ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమింగ్ యాప్స్ వినియోగం ఎక్కువైంది
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవారినికి గురిచేస్తోంది. అమెరికా, స్పెయిన్, ఇటలీలో మరణ మృదంగం మోగిస్తోంది. ఆ దేశాలను చూసి … మిగతా దేశాలు మరింత అప్రమత్తం అవుతున్నాయి. భారత ప్రధాని కూడా కరోనా కట్టడికోసం దేశ ప్రజలంతా సహాకరించాలని కోరారు. అంతేకాదు కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తాన్ని లాక్‌డౌన్ చేశారు. దాంతో పాటు, కరోనా వైరస్ భయంతో దేశ ప్రజలందరూ చాలా వరకు ఇళ్లలోనే గడుపుతున్నారు. ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమింగ్ యాప్స్ వినియోగం ఎక్కువైంది. గత రెండు నెలలుగా మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ దాదాపు 40 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్స్‌కే పరిమితమై న్యూస్, సమాచారం, ఎంటర్‌టైన్మెంట్ ఇలా అన్నింటినీ యాప్స్ ద్వారానే తెలుసుకుంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన ‘ఇన్‌మోబి గ్రూప్’ నివేదిక వెల్లడించింది. పాఠశాలలు, కాలేజీలు అన్నీ కూడా బంద్ అయ్యాయి. పరీక్షలు కూడా జరిగే పరిస్థితి లేదు. పరీక్షల లేకుండానే తర్వాత తరగతికి ప్రమోట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పిల్లలు బయటకు వెల్లి ఆడుకునే వెసులు బాటు కూడా లేకపోవడంతో.. బుక్స్, కామిక్స్ యాప్‌కు ఆదరణ పెరిగింది. ఈ నెల తొలి వారం తర్వాత ఇటువంటి యాప్‌ల వినియోగం ఒక్కసారిగా పెరిగినట్టు ఇన్ మోబి తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటకలో స్కూళ్లు మూతపడిన తర్వాత లెర్నింగ్, రీడింగ్ యాప్స్‌కు డిమాండ్ పెరిగినట్టు నివేదిక వెల్లడించింది. జనవరి మాసాంతంలో బ్రౌజింగ్ యాప్‌ల వినియోగం పడిపోగా, దేశంలో తొలి కోవిడ్ నమోదైన తర్వాత బ్రౌజింగ్ యాప్‌ల వినియోగం అమాంతం పెరిగినట్టు వివరించింది. బుక్స్, కామిక్ యాప్స్ వినియోగం 200 శాతం పెరగ్గా, గేమింగ్ యాప్స్ వినియోగం 110 శాతం పెరిగింది. ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం 60 శాతం పెరిగింది. మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ 37 శాతం పెరిగింది. మార్చి 5 నుంచి అయితే ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం రాకెట్ స్పీడ్ అందుకుందని వివరించింది. ఫిబ్రవరి 12 నుంచి గేమింగ్ యాప్‌ల వినియోగం క్రమంగా పెరినట్టు పేర్కొంది.
Tags: coronavirus, gaming apps,comics, lockdown, school and colleges