‘తెలంగాణలో జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు..!’

by Shyam |   ( Updated:2021-10-10 05:54:06.0  )
‘తెలంగాణలో జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు..!’
X

దిశ, అచ్చంపేట: జర్నలిస్టు ప్రభాకర్‌పై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుల దాడికి నిరసనగా అచ్చంపేటలో అదివారం జర్నలిస్టులు అంబేద్కర్ చౌరస్తా ముందు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు దుమర్ల భాస్కర్, ముడవత్ రాములు మాట్లాడుతూ.. సమాజంలో నిజాయితీగా నిక్కచ్చిగా వార్తలు రాస్తున్న విలేకరులపై తెలంగాణ రాష్ట్రంలో దాడులు పెరుగుతున్నాయని అన్నారు.

ఆత్మకూర్ మండలంలో జర్నలిస్టు ప్రభాకర్ ఇంటిపైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు అలుపెరుగని ఉద్యమాలు, నిరసనలు చేశారని, పొరాటం చేసి సాధించుకున్న రాష్టంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం భంగం కల్గిస్తుందని విమర్శించారు. అంతకుముందు అచ్చంపేట తాలూకా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు నాయక్ జరిగిన సంఘటనను ఒక ప్రకటనలో ఖండించారు. నిరసనకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, కాంగ్రెస్‌ మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు మహబూబ్ అలీ సంఘీభావం తెలిపారు.

Advertisement

Next Story