- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోడు రైతులకు హక్కు పత్రాలిప్పిస్తా: ఎమ్మెల్యే రేగా కాంతారావు
దిశ, ఖమ్మం: వివాదాస్పద గిరిజన పోడు భూముల విషయంలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గిరిజన రైతులకు స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి గెస్ట్ హౌస్ లో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆ రెండు శాఖల అధికారుల వద్ద ఉన్న మ్యాపులను, ఫారెస్ట్ గెజిట్ లను పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ.. పోడు భూముల విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. శాశ్వత పరిష్కారం చూపేలా భూమికి హక్కుపత్రాలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అయితే రెవెన్యూ, ఫారెస్ట్ భూముల లెక్కలు తేలితేనే ఇది సాధ్యమవుతుందన్నారు. రెండు శాఖల అధికారులు జూన్ ఒకటవ తేదీ నుంచి జాయింట్ సర్వేకు సిద్ధం కావాలన్నారు. అలాగే అశ్వాపురం మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కూడా స్థలం సేకరిస్తున్నామని, ఇది పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు.