సాఫ్ట్‌వేర్ లహరి సూసైడ్ కేసులో అత్తమామలు అరెస్ట్

by Shyam |   ( Updated:2020-07-07 04:59:24.0  )
సాఫ్ట్‌వేర్ లహరి సూసైడ్ కేసులో అత్తమామలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: భర్త వెంకటేశ్ వేధింపులు తాళలేక గతనెల 26న సూసైడ్ చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లహరి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. లహరి అత్తమామలు, ఆడపడుచులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. లహరి సూసైడ్ చేసుకున్నప్పటి నుంచి ఆమె అత్తమామలు, ఆడపడుచులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పీసీపల్లి మండలం వరిమడుగు గ్రామంలో బంధువుల ఇంట్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో లహరి భర్త వెంకటేశ్‌ను ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed