- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో మరో వైరస్.. కరోనా కంటే డేంజర్ అంటున్న వైద్యులు
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే వైరస్ కొంత తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో మరో వైరస్ దేశాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. అత్యంత ప్రమాదకర నిఫా వైరస్ ఆనవాళ్లను మహారాష్ట్రలోని మహాబలేశ్వర్గుహలో ఉన్న గబ్బిలాల్లో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
గుహలో వ్యాధి సోకిన గబ్బిలాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా.. గబ్బిలాల్లో నిఫా వైరస్ వ్యాపించినట్లు తేలిందని.. పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే.. మహారాష్ట్రలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఈ వైరస్‌ను గుర్తించలేదని పరిశోధన బృందం నాయకురాలు డా. ప్రాద్య్న యాదవ్ పేర్కొన్నారు.
నిఫా వైరస్.. కరోనా వైరస్ కంటే ఎంతో ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిఫా వైరస్‌కు టీకా కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. కాగా, నిఫా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకితే మాత్రం భారీ ప్రాణ నష్టం జరగవచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1998లో మలేషియాలో మొదటిసారిగా నిఫా వైరస్‌ను కనుగొన్నారు. ఆ తర్వాత 2004లో ఈ వైరస్ బంగ్లాదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. కాగా, 2018లో కేరళలో నిఫా వైరస్ తీవ్ర అలజడి సృష్టించింది. కేరళలో నిఫా వైరస్ సోకి 17 మంది మృత్యువాతపడ్డారు.