రికార్డు సృష్టించిన మేక.. లక్షలు పోసి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియన్

by Shyam |
రికార్డు సృష్టించిన మేక.. లక్షలు పోసి సొంతం చేసుకున్న ఆస్ట్రేలియన్
X

దిశ, ఫీచర్స్ : మేలు జాతికి చెందిన కొన్ని పశువుల ధర కోట్ల రూపాయలు పలకడం తెలిసిందే. తాజాగా ఓ మేక కూడా ఊహించని ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాలోని పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ సిటీ, కోబార్‌లో ‘మరకేష్’ జాతికి చెందిన మేకను ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి 12,000 డాలర్ల(దాదాపు రూ.15 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఆకర్షణీయమైన రూపంతో గంభీరంగా కనిపిస్తున్న ఈ మేకను అతను ‘స్టైలిష్ బక్’గా పేర్కొనగా.. ఆస్ట్రేలియాలో అత్యధిక ధర పొందిన మేకగా రికార్డు సృష్టించింది.

ఇక ప్రస్తుతం మరకేష్‌ను రికార్డు ధరకు సొంతం చేసుకున్న మోస్లీ.. తాను కొనుగోలు చేసిన మేక మరీ పెద్దది కాకపోయినా కండరాలు బలిష్టంగా ఉన్నాయని తెలిపాడు. తనకు ఖరీదైన మేకలు కొనుగోలు చేయడం హబీ కాగా.. గతేడాది కూడా $9,000 చెల్లించి ఓ మేకను సొంతం చేసుకున్నాడు. కాగా ‘మేకల మాంసానికి గల డిమాండ్‌కు అనుగుణంగానే వీటి ధరల్లో పెరుగుదల ఉన్నట్లు తెలిపాడు. ఇక మరకేష్ మేక విషయానికొస్తే.. క్వీన్స్‌లాండ్ సరిహద్దుకు దూరంగా ఉన్న రేంజ్‌ల్యాండ్ రెడ్ స్టడ్‌లో పెంచారన్నాడు.

Advertisement

Next Story