రాయల్ ఎన్‌ఫీల్డ్ కార్యాలయాల మూసివేత!

by Harish |   ( Updated:2020-06-13 07:53:09.0  )
రాయల్ ఎన్‌ఫీల్డ్ కార్యాలయాల మూసివేత!
X

ముంబయి: కరోనా సంక్షోభం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకొనేందుకు ప్రముఖ బుల్లెట్, క్లాసిక్ మోటార్ సైకిళ్ల కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ సుమారు 12 ప్రాంతీయ కార్యాలయాలను మూసేస్తున్నట్టు వెల్లడించింది. ఇండియాలో ఉన్న చెన్నై, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, హైదరాబాద్, ఝార్ఖండ్, భువనేశ్వర్ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలను మూసేయనున్నట్టు అంతర్జాతీయ సర్క్యులర్ జారీ చేసింది. అయితే, కార్యకలాపాలు మూసేసినప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుందని రాయల్ ఎన్‌ఫీల్డ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ లలిత్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగులకు ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ శుక్రవారం మార్చి త్రైమాసికంలో కార్యకలాపాల నుంచి ఏకీకృత ఆదాయంలో 12 శాతం తగ్గి రూ.2,208కోట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే, మార్చి త్రైమాసికంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 1,63,083 మోటార్ ‌సైకిళ్లను విక్రయించి, అంతకు ముందు సంవత్సరం కంటే 17శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story