అమీర్ ఖాన్ ‘బెస్ట్ ఆన్ స్క్రీన్ కిస్సర్’.. మరి ఇమ్రాన్ హష్మి?

by Shyam |
అమీర్ ఖాన్ ‘బెస్ట్ ఆన్ స్క్రీన్ కిస్సర్’.. మరి ఇమ్రాన్ హష్మి?
X

దిశ, సినిమా: ఇమ్రాన్ హష్మి, భూషణ్ కుమార్ కాంబినేషన్‌లో ఇప్పటికే చాలా సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. లాస్ట్ సింగిల్ ‘మై రహూ యా నా రహూ’ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అందుకోగా.. లేటెస్ట్‌గా రిలీజైన రొమాంటిక్ సాంగ్ ‘లూట్ గయే’ కూడా సూపర్బ్ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. అయితే స్క్రీన్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్.. ఈ సాంగ్ వర్చువల్ ప్రమోషన్స్‌లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడారు. తను కాకుండా బెస్ట్ ఆన్ స్క్రీన్ కిస్సర్ ఎవరనే ప్రశ్నకు అమీర్ ఖాన్ అని సమాధానం ఇచ్చారు. ఒకవేళ తనకు అవకాశమొస్తే సల్మాన్ ఖాన్‌కు ఆ తెలివి, చమత్కారం ఎక్కడి నుంచి వచ్చాయని? అడుగుతానన్నారు. ఇక షారుఖ్ ఖాన్‌లో ఉన్న కృషి, పట్టుదల లక్షణాలను ఆరాధిస్తానని.. తను ఈ స్థాయికి వచ్చేందుకు కారణం కూడా అవేనని అభిప్రాయపడ్డారు. ఇక రాత్రి ఎనిమిది గంటల తర్వాత అజయ్ దేవగన్‌తో సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని ఉందని తెలిపాడు ఇమ్రాన్.

Advertisement

Next Story