సర్కార్ కీలక నిర్ణయం.. 8 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు..

by Shamantha N |
సర్కార్ కీలక నిర్ణయం.. 8 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 8 పట్టణాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అజ్మీర్, బిల్వారా, జైపూర్, జోధ్‌పూర్, కోటా, ఉదయ్‌పుర్, సాంగ్వాడా, బంస్వారాలో సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తు్న్నట్టు తెలిపింది.

అయితే ఈనెల 25 నుంచి రాజస్థాన్ వచ్చే ప్రయాణికులు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని.. రిపోర్టును ప్రయాణీకులు వెంట తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక వేళ నెగిటివ్ రిపోర్టు లేనట్లైతే వారు కచ్చితంగా.. 15రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10గంటలలోపే పట్టణ ప్రాంతాల్లోని మార్కె్ట్లు, షాపులు మూసివేయాలని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed