- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవగాహన తెచ్చుకున్నాం.. సౌతాఫ్రికా మ్యాచ్‌లో అదొక్కటే ముఖ్యం: కేఎల్ రాహుల్
దిశ, స్పోర్ట్స్: విదేశాల్లో టెస్ట్ సిరీస్ ఆడే సమయంలో మంచి ఆరంభం లభించడం చాలా ముఖ్యం. మేము కూడా తొలి టెస్టులో సరైన ఆరంభం కోసం సిద్ధంగా ఉన్నామని టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఆదివారం నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ‘దక్షిణాఫ్రికాలో వికెట్లపై ఉండే బౌన్స్, వేగం ఇతర దేశాలతో పోల్చితే చాలా వైవిధ్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడటం కూడా ముఖ్యమే.
అందుకే తొలి టెస్టు కంటే కొంచెం ముందుగానే ఇక్కడకు చేరుకున్నాము. గతంలో ఇక్కడ 2 టెస్టులు ఆడిన అనుభవం ఉన్నది. అందుకే పెద్దగా ఆందోళన చెందడం లేదు. ప్రాక్టీస్‌తో పాటు మ్యాచ్ సిమ్యులేషన్స్ ఉపయోగించి పిచ్‌లపై అవగాహన తెచ్చుకున్నాము. ఆస్ట్రేలియాలో కూడా బౌన్సీ, పేస్ పిచ్‌లపై ఆడాము. కానీ ఇక్కడ పిచ్‌లు కాస్త మెత్తగా ఉంటాయి. చాలా వేగంగా వికెట్ మారిపోతూ ఉంటుంది. ‘ అని రాహుల్ అన్నాడు. ఇక తాను తిరిగి టెస్టు మ్యాచ్ ఆడతానని నేను అనుకోలేదు. అయితే జట్టులోకి రావడమే కాకుండా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ సారి కూడా మంచి ప్రదర్శనే ఇవ్వడానికి కృషి చేస్తాను.