విదేశీ వాహన దిగుమతులపై బాదుడు?

by  |
విదేశీ వాహన దిగుమతులపై బాదుడు?
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశంలోకి దిగుమతి అవుతున్న విదేశీ కార్లపై దిగుమతి సుంకం పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. కంప్లీట్ నాక్డ్ డౌన్, సెమీ నాక్డ్ డౌన్ యూనిట్లు విదేశాల నుంచి కార్లను దిగుమతి చేసుకోవడం వలన భారత్‌ను కేవలం అసెంబ్లింగ్ కేంద్రంగానే ఉపయోగించుకుంటున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు.

అందువలన ఇలాంటి వాహనాలపై దిగుమతి సుంకం పెంపు అనేది అంతపెద్ద చెడ్డ ఆలోచన కాదని పీయూష్ గోయల్ వెల్లడించారు.అంతేకాకుండా విదేశీ కార్ల కంపెనీలు భారత్‌లో తయారీ దిశగా ఆలోచన చేయాలని, అలాంటి వారికి భారత ప్రభత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.


Next Story