- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేనే సొంతంగా నిర్మిస్తున్నా.. : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
దిశ, ఆదిలాబాద్: రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్ సంకల్పమని, అందుకే రైతు సంక్షేమం కోసం ఆయన అనేక పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం న్యూపోచం పహాడ్ లో అక్కాపూర్ క్లస్టర్ రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం భూమిపూజ చేశారు. రైతు వేదికల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రూ.22 లక్షల వ్యయంతో తన సొంత నిధులతో దివంగత అల్లోల చిన్నమ్మ- నారాయణ రెడ్డిల స్మారకార్థం ఈ వేదికను నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్నదాతలను ఆదుకునేందుకే రుణాల మాఫీ, రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశ పెట్టి ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసి ఆర్థికంగా బలపడాలని సూచించారు. రైతులందరూ ఒకచోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా ‘రైతు వేదిక’లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్ట మొదటి రైతు వేదికను నిర్మల్ లో ప్రారంభించుకున్నామని తెలిపారు.