భారత ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇస్తున్నాం -ఐఎంఎఫ్

by  |
భారత ప్రభుత్వ చర్యలకు మద్దతు ఇస్తున్నాం -ఐఎంఎఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(IMF) అభిప్రాయపడింది. ముఖ్యంగా బలహీన గృహస్థులకు ఆదాయ మద్దతుగా ఖర్చుల కోసం, అలాగే ఆరోగ్య, ఆహార రంగాల్లో వ్యయం చేసేందుకు, కుదేలైన వ్యాపారాలకు అండగా నిలబడేందుకు మరో ఉద్దీపన అవసరమని ఐఎంఎఫ్ తెలిపింది.

కరోనా వైరస్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ నమోదు చేసిన GDP సంకోచంపై స్పందించిన ఐఎమ్‌ఎఫ్‌ కమ్యూనికేషన్‌ విభాగం డైరెక్టర్‌ గెర్రీ రైస్‌.. ‘కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతు ఇస్తున్నాం. తక్కువ ఆదాయమున్న కార్మికులు, ప్రజలకు, ఆర్థిక రంగానికి ద్రవ్య లభ్యత కోసం తీసుకున్న చర్యలు బాగున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇవి సరిపోవు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరింత ఉద్దీపన ప్యాకేజీ భారత్‌కు అవసరమని’ చెప్పారు.

స్వల్పకాలికంలో ఆర్థిక పారదర్శకత పెరుగుదలతో పాటు, విశ్వసనీయమైన మీడియం టర్మ్ ఆర్థిక ప్రణాళిక ముఖ్యమని ఐఎంఎఫ్ ప్రతినిధి చెప్పారు. ఇది మార్కెట్ విశ్వాసాన్ని పెంచేందుకు సహాయపడుతుందని, తద్వారా రుణాలు తీసుకునే వ్యయాన్ని తగ్గించేందుకు, అలాగే ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సహాయపడగలదని ఆశిస్తున్నట్టు గెర్రీ రైస్ వెల్లడించారు.

Read Also…

మరింత తగ్గనున్న GDP..


Next Story

Most Viewed