- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల ఎదుటే అక్రమ నిర్మాణం
దిశ,ఎల్బీనగర్: అక్రమ నిర్మాణాలు ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని చోట్ల నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అధికార బలంతో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ జోనల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమ నిర్మాణాలకు పూనుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్, రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.
మున్సిపల్ చట్టం ప్రకారం 850 గజాల విస్తీర్ణం కలిగిన ప్లాటుకు మాత్రమే సెల్లార్ తవ్వకానికి అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సెల్లార్‌ను తవ్వి యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఎల్బీనగర్ సర్కిల్ జోనల్ కమిషనర్ కార్యాలయానికి ఇదే రూటులో నిత్యం మున్సిపల్ అధికారులు, సిబ్బంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత పెద్ద ఎత్తునా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కార్పొరేటర్ అండదండలు..
ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ఎదురుగానే చేపడుతున్ననిర్మాణాలకు అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు నిర్మాణం వద్ద కాపలా కాసి మరీ కట్టడాలను నిర్మిస్తున్నారు. సామన్యులు ఇండ్లు నిర్మించుకోవాలంటే రూల్స్ మాట్లాడే మున్సిపల్ అధికారులు, ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నోరు మెదపడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.