- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ పథకాల పేరుతో అక్రమాలు.. అడ్డుకట్టేదెవరు..?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సర్కారు పథకాల పేరు చెప్పి.. ఇసుక పంపిణీ అనుమతుల వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అవసరం లేకున్నా అన్నారం నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలించి అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు. డబుల్ ఇండ్ల నిర్మాణానికి అనుమతి తీసుకున్న కాంట్రాక్టరు, అన్నారం ఇసుక స్టాక్ యార్డు సిబ్బందితో లారీల వాళ్లు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తెచ్చి దందా చేస్తున్నారు. ఇదంతా తెలిసినా తమకంటే తమకేం సంబంధం లేదని మైనింగ్, ఆర్ అండ్‌బీ శాఖల అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 440 క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే పట్టుకుని సీజ్ చేశారు.
పథకాల పేరిట పక్కదారి
జిల్లాలో సర్కారు పథకాల పేరిట అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నిర్మల్ సమీపంలోని నాగనాయిపేట డబుల్ బెడ్రూం ఇండ్ల పేరిట ఇసుక అనుమతులు పొంది పక్కదోవ పట్టించిన లారీ సోమవారం నర్సాపూర్ (జి) వద్ద పట్టుబడిన విషయం తెలిసిందే. ఇలా సర్కారు పథకాల పేరుతో ఇసుక అనుమతులు పొంది, రవాణా సాగిస్తున్న వ్యవహారంలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నాగనాయిపేట డబుల్ ఇండ్ల కోసం ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉండగా, గతంలో ఐదు వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక రాజురా నుంచి సరఫరా చేశారు. మరో మూడు వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక ఇటీవల అన్నారం నుంచి తీసుకు వస్తుండగా కేవలం 100 క్యూబిక్‌మీటర్లు మాత్రమే అవసరమని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. దీనిని సాకుగా చూపి పెద్ద ఎత్తున ఇసుకను తెచ్చి బయట మార్కెట్లో విక్రయిస్తున్నారనే విమర్శలున్నాయి.
అంతా కలిసి దందా..?
సోమవారం నర్సాపూర్ (జి) వద్ద పట్టుబడిన ఇసుక లారీతో తమకేం సంబంధం లేదని కాంట్రాక్టరుకు సంబంధించిన సైట్ ఇంజినీరు కూడా చెబుతున్నారు. అన్లోడిండ్చేయించాక.. రిసిప్టు ఇస్తామని, అనుమతి పొందిన క్వారీలో అది చూపాకే.. మళ్లీ లోడింగ్ చేస్తారని సైట్ఇంజినీరు పేర్కొంటున్నారు. అలాంటిది నాగనాయిపేటలో ఇసుక అన్ లోడిండ్ కాకుండానే.. వేరే ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయించే ప్రయత్నం చేసి దొరికి పోయారు. డబుల్ ఇండ్ల సైట్ఇంజినీరు పాత రిసిప్టులను చూపి అన్నారం నుంచి ఇసుక తెస్తున్నారా.. లేక.. రిసిప్టులు లేకుండానే స్టాక్ పాయింట్ వారితో కుమ్మక్కై అక్రమంగా తరలిస్తున్నారా..? అనే విషయాన్ని మైనింగ్ శాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. లేదా డబుల్ బెడ్రూం ఇండ్ల సైట్లో పోయకుండానే పోసినట్లు చూపి బయట మార్కెట్లో విక్రయిస్తున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంలో అంతా కలిసి దందా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో మామడ మండలం కొత్తూరు ఆదర్శనగర్‌లో 675 క్యూబిక్‌మీటర్ల ఇసుక డంపులు పట్టుకోగా.. పది లారీలకు కలెక్టర్ముషారఫ్ అలీ ఫారూఖీ అనుమతిచ్చారు. గంజాల్, కడ్తాల్ డబుల్ బెడ్రూం ఇండ్లకు అనుమతివ్వగా, అనుమతి లేని ఓ లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. రెవెన్యూ వారు చూసుకోలేదని తర్వాత లారీని ఖాళీ చేయించి.. ఎలాంటి కేసు, జరిమానా లేకుండానే వదిలేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 99 లారీలను పట్టుకోగా.. 440.26 క్యూబిక్‌మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకుగాను రూ.12,50,400 మేర జరిమానా రూపంలో వసూలు చేశారు. ఫిర్యాదు వస్తేగానీ.. పోలీసులు టార్గెట్ల కోసం మాత్రమే ఇసుక ట్రాక్టర్లు, లారీలు పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. వాల్టా చట్టం కింద జరిమానా వసూలు చేస్తున్నారు. అధికారులకు తెలిసినా కొన్ని చోట్ల పట్టించుకోకుండా.. ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
తమకేం సంబంధం లేదు
నాగనాయిపేటకు మొత్తం 8 వేల క్యూబిక్‌మీటర్ల ఇసుకకు గతంలో 5 వేలు, ఇటీవల మరో 3 వేల క్యూబిక్‌మీటర్ల ఇసుక అన్నారం సరఫరా చేస్తున్నారు. అక్కడ మరో 100 క్యూబిక్‌మీటర్ల ఇసుక మాత్రమే అవసరం ఉంది. అయితే అక్కడ పోయాల్సిన ఇసుక వేరే ప్రాంతానికి తరలించినట్లు తమ దృష్టికి వచ్చింది. దాంతో తమకేం సంబంధం లేదు. సంబంధింత కాంట్రాక్టరు, సైట్ ఇంజినీరు అన్లోడ్అయ్యాక.. రిసిప్టు ఇస్తేనే అన్నారంలో మరో లోడు చేయాల్సి ఉంటుంది. ఆర్అండ్బీ ఈఈ అశోక్ కుమార్
విచారణ చేస్తున్నాం..
నర్సాపూర్(జి) వద్ద పట్టుబడిన లారీకి సంబంధించి ఎవరూ రాలేదు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో అనుమతులు తీసుకుని.. అక్కడకి వెళ్లకుండా వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. ఆర్ అండ్ బీ వారు అనుమతిచ్చారా.. లేదా.. సైట్ ఇంజినీరు అన్లోడింగ్రిసిప్టు ఇచ్చాకే.. స్టాక్ పాయింట్లో మళ్లీ లోడింగ్ చేయాలి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. క్రాంతి కుమార్, మైనింగ్ ఏడీ