బొలెరోలో ఇసుక రవాణా

దిశ, బోధన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బోధన్ మండలంలోని హుంస్సా గ్రామంలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ వాహనం పట్టుబడింది.

అనంతరం ఆ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంజీరా నధి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement