రుద్రారంలో అక్రమంగా మట్టి తవ్వకాలు..!

దిశ, పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో ఆర్ఐ రంగయ్య ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్ఐ ను కాశిరెడ్డి భాస్కర్‎రెడ్డి అనే వ్యక్తి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల సహకారంతో 5 ట్రాక్టర్లు, ఒక జేసీబీలను పట్టుకున్నట్లు తహశీల్దార్ మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్ఐ విధులకు ఆటంకం కలిగించిన కాశిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement