- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడి బిజినెస్ స్కూల్ ఎంట్రీకీ ‘హ్యారీపోటర్’ కారణం
దిశ, వెబ్ డెస్క్ : హ్యారీపోటర్ పుస్తకాలు, సినిమాలు తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన పుస్తకాల్లో హ్యారీపోటర్ సిరీస్ కూడా ఒకటి. బ్రిటీష్ రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన ఈ ఏడు కాల్పనిక పుస్తకాలు.. చిన్నారులను ఓ మాంత్రిక లోకంలోకి తీసుకెళ్తాయి. కాగా చాలా మంది చిన్నారుల ఫేవరెట్ మూవీ, బుక్ లిస్టులో ‘హ్యారీపోటర్’ తప్పక ఉంటుంది. ఇలానే ఓ కుర్రాడు కూడా హ్యారీపొటర్ పుస్తకాలను తెగ ఇష్టపడ్డాడు. ఎంతలా అంటే.. ఒక్కో హ్యారీపోటర్ పుస్తకాన్ని ఏడుసార్లకు పైగా చదివేంతలా. అయితే ఏంటని అంటారా? ఆ పుస్తకాలే.. అతడిని మూడు బిజినెస్ స్కూళ్ల (ఐఐఎమ్ అహ్మదాబాద్, ఐఐఎమ్ బెంగళూరు, ఐఐఎమ్ కలకత్తా) ఇంటర్య్వూలు క్రాక్ చేసేందుకు ఉపయోగపడ్డాయి. ఇంతకీ అతడి పేరు చెప్పలేదు కదా! ఆ హ్యారీపోటర్ పుస్తక ప్రియుడే రోహన్ జైన్ .
‘మూడు బిజినెస్ స్కూళ్ల ఇంటర్వ్యూలను విజయవంతంగా ముగించడానికి హ్యారీపోటర్ నా వెంట నిలిచాడు. హ్యారీపోటర్ ఒక్కో సిరీస్ పుస్తకాన్ని ఏడుసార్లకు మించి చదివానని గర్వంగా చెప్పుకుంటాను. అందులోని కోట్స్, స్టోరీలు.. నా హృదయంతో చదివాను. నా జీవితంలో ఎక్కువగా తెలిసిన సబ్జెక్ట్ హ్యారీపోటర్ ఒక్కటే. ప్యానల్ మెంబర్స్‌కు కూడా హ్యరీ గురించి నాకు తెలిసినన్ని విషయాలు తెలియకపోవచ్చు’ అని రోహన్ తెలిపారు. అంతేకాదు ఆ మూడు ఇంటర్వ్యూలు ఎలా జరిగాయో’ తన మాటల్లోనే చెప్పుకొచ్చాడు రోహన్.
‘ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్యానల్ మెంబర్ నా హాబీస్ గురించి అడిగాడు. నేను రీడింగ్ బుక్స్ అని సమాధానం ఇచ్చాను. ఆ తర్వాత పది నిమిషాల వరకు కేవలం ఆ పుస్తకాల్లోని కోట్స్‌ను బేస్ చేసుకునే నా ఇంటర్వ్యూ నడిచింది. ఈ పది నిమిషాలు.. నేను ఇంటర్వ్యూ బ్రేక్ చేయడానికి ఎంతో దోహదపడింది. అంతేకాదు, ప్యానల్ మెంబర్.. ఎమ్మా వాట్సన్‌తో ప్రేమలో పడ్డావా ఏంటి? అంటూ జోక్ కూడా చేశాడు’ అని తొలి ఇంటర్య్వూ గురించి చెప్పుకొచ్చాడు రోహన్. ఇక ఐఐఎమ్ బెంగళూరు విషయానికి వస్తే.. ‘ఇంటర్వ్యూ బాగానే సాగుతోంది. అయితే సడెన్‌గా ప్యానల్ మెంబర్.. నా ఫేవరెట్ బుక్ గురించి అడిగాడు. అంతే ఇంటర్వ్యూ స్వరూపమే మారిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు.. హ్యారీ పోటర్ నుంచి నేను ఏం నేర్చుకున్నాను, మేనేజ్‌మెంట్‌లో ఆ విషయాలు ఎలా ఉపయోగపడతాయి, నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి వంటి విషయాలు చర్చించాను. ప్యానల్ మెంబర్స్ అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఇక ఐఐఎమ్ కోలకత్తాలోనూ ఇదే జరిగింది. అక్కడ కూడా దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు.. హ్యారీపోటర్ గురించే మాట్లాడాను’ అని తన ఇంటర్వ్యూ విశేషాలు చెప్పాడు రోహన్ .
నిజమే మరి.. ‘జాక్ ఆఫ్ ఆల్.. మాస్టర్ ఆఫ్ వన్ సబ్జెక్ట్’ అని అందుకే అంటారు. ఒక సబ్జెక్టులోనైనా మనం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే.. విజయం సాధించవచ్చని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు రోహన్ విషయంలోనూ అదే నిజమనిపిస్తోంది. బ్రూస్ లీ కూడా ఏమంటాడంటే.. ‘వందల రకాల కిక్స్ ప్రాక్టీస్ చేసే వారిని చూసి నేను భయపడను.. కానీ ఒకే కిక్కును వందలసార్లు ప్రాక్టీస్ చేసే వారిని చూసి జాగ్రత్త పడతాను’ అని. అంతెందుకు ప్రస్తుతం యూట్యూబ్‌లో పుట్టగొడుగుల్లా రోజుకో చానల్ పుట్టుకొస్తూనే ఉంది. వాటిలో చాలా మంది ఒక సబ్జెక్టులో మాత్రమే మాస్టర్‌గా నిలిచారు. దాన్ని ఉపాధిమార్గంగా, ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సో.. వందల రకాలు నేర్చుకునే బదులు, ఒక దాంట్లో సూపర్ స్పెషలిస్ట్ అయితే, భవిష్యత్ మనదే అవుతుంది.