- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డ్రోన్ సాయంతో శానిటైజ్ .. ఐఐటీ విద్యార్థుల టెక్నాలజీ

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలో ప్రతి చిన్న ప్రదేశాన్ని శానిటైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వాలన్నీ పెద్ద మొత్తంలో సిబ్బందిని పెట్టి అన్ని ప్రదేశాలను శానిటైజ్ చేయిస్తున్నాయి. వీరికి సాయపడేందుకు ఐఐటీ గువహటి విద్యార్థులు ఒక డ్రోన్‌ని తయారు చేశారు. దీని సాయంతో పార్కులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు వంటి ప్రదేశాలను శానిటైజ్ చేయొచ్చు.
రేజర్‌ఫ్లై పేరుతో స్టార్టప్ పెట్టుకున్న ఐఐటీ విద్యార్థులు అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలను కలిసి తమ టెక్నాలజీ గురించి వివరించారు. వారి డ్రోన్ స్ప్రేయింగ్ టెక్నాలజీతో పదిహేను రోజుల్లో చేసే పని 15 నిమిషాల్లో చేయవచ్చని చెప్పారు. మొబైల్ యాప్ ద్వారా డ్రోన్‌ని కంట్రోల్ చేస్తూ కేవలం ఒకే మనిషి పెద్ద విస్తీర్ణాలను శానిటైజ్ చేయవచ్చని విద్యార్థుల్లో ఒకరైన అనంత్ మిట్టల్ తెలిపారు.
ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు సోషల్ డిస్టెన్స్ పాటించే సదుపాయం కలుగుతుందని అనంత్ అన్నాడు. మొత్తం ఐదుగురు విద్యార్థులు కలిసి తయారు చేసిన ఈ డ్రోన్లను ఉపయోగంలోకి తీసుకువచ్చాక, ఈ నెలాఖరుకి మరో 50 సిద్ధం చేస్తామని అనంత్ చెప్పాడు.