డీలా పడిన పారిశ్రామికోత్పత్తి

by Harish |
డీలా పడిన పారిశ్రామికోత్పత్తి
X

దిశ, వెబ్‌డెస్క్: 2020, నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) 1.9 శాతం క్షీణించిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు నెల అక్టోబర్‌లో 4.2 శాతం, 2019, నవంబర్‌లో 2.1 శాతంతో పోలిస్తే నవంబర్‌లో పారిశ్రామికోత్పత్తి క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో పారిశ్రామికోత్పత్తి 15.5 శాతం కుదించుకుపోయిందని, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 0.3 శాతం వృద్ధిని సాధించినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. మైనింగ్ రంగం 7.3 శాతం, తయారీ రంగం 1.7 శాతం సంకోచించాయని, విద్యుత్ రంగం 3.5 వృద్ధిని సాధించినట్టు గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story