ఇగ్నోకు న్యాక్ ఏ ప్ల‌స్ ప్ల‌స్ గుర్తింపు

by Shyam |
ఇగ్నోకు న్యాక్ ఏ ప్ల‌స్ ప్ల‌స్ గుర్తింపు
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: ఇందిరాగాంధీ జాతీయ సార్వ‌త్రిక విశ్వ‌విద్యాల‌యం (ఇగ్నో) న్యాక్ ఏ ప్ల‌స్ ప్ల‌స్ గుర్తింపు పొందింది. భార‌త‌దేశ దూర‌విద్యా రంగంలోనే ప్ర‌ప్ర‌ధ‌మంగా న్యాక్ గుర్తింపు పొందిన సార్వ‌త్రిక విశ్వ విద్యాల‌యంగా ఇగ్నో చ‌రిత్ర సృష్టించింది. ఈ మేర‌కు ఇగ్నో వీసీ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర రావు, సంచాల‌కులు ఎస్ ఫ‌యాజ్‌లు మంగ‌ళ‌వారం మీడియాకు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప‌ద‌కొండు మందితో కూడిన న్యాక్ బృందం ఈ నెల 5 నుండి 7 వ‌ర‌కు ఇగ్నో కేంద్ర కార్యాల‌యంతో పాటు ప్రాంతీయ , అధ్య‌య‌న కేంద్రాల‌ను సంద‌ర్శించిన‌ట్లు వారు తెలిపారు.

న్యాక్ బృందం త‌మ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా అన్ని ర‌కాల మౌళిక స‌దుపాయాల‌ను ప‌రిశీలించార‌ని, బోధ‌న‌,బోధ‌నేత‌ర సిబ్బందితో చ‌ర్చించార‌ని చెప్పారు. అంతేకాకుండా దేశంలోని వివిధ ప్రాంతీయ కేంద్రాల‌ను దృశ్య శ్ర‌వ‌ణ విధానంలో సంద‌ర్శించిన‌ట్లు వారు పేర్కొన్నారు . ఇగ్నో త‌న తొలి ప్ర‌య‌త్నంలోనే అత్యున్న‌తమైన న్యాక్ గుర్తింపు పొందింద‌న్నారు . ప్ర‌స్తుతం విశ్వ విద్యాల‌యంలో 35 ల‌క్ష‌ల మంది విద్యార్థులున్నార‌ని వివరించారు. రానున్న రోజుల్లో ఇగ్నో మ‌రింత ఉత్సాహంతో దేశ ప్ర‌జ‌లంద‌రికి ఉన్న‌త విద్య‌ను అందించ‌డానికి తోడ్ప‌తుదుంద‌ని వారు ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed