- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుట్టు రాలడం తగ్గాలంటే..!
జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా.? కురులను కాపాడుకునేందుకు వయసుతో సంబంధం లేకుండా తమకు తోచిన చిట్కాలను పాటిస్తున్నారా..? అయితే జుట్టు రాలడాన్ని తగ్గించి, వాటి ఎదుగుదలకు ఉపయోగపడే కూరగాయలు గురించి తెలుసుకుందాం.
ఐరన్ లోపం కారణంగానే చాలా మందికి జుట్టు రాలుతోంది. ఇలాంటి వారికి కురులను దృఢంగా ఉంచేందుకు పాలకూర ఉపయోగపడుతుంది. దీనిలో పీచు పదార్థం, ఐరన్, జింక్, ఇతర ఆవశ్యక విటమిన్లు లభిస్తాయి. ఇక వంటకాల్లో ఎక్కువగా వాడే ఉల్లిపాయలో జింక్, ఐరన్, బయోటిన్‌తో సహా జుట్టు ఎదుగుదలకు పోషకాలు లభిస్తాయి. ఇది చిన్న వయసులో వెంట్రుకలు తెల్లగా మారడాన్ని నిరోధిస్తాయి. చిలగడదుంపలో బీటాకెరోటిన్ అధికమొత్తంలో లభిస్తోంది. ఆహారం ద్వారా మనం తీసుకొన్న బీటా కెరోటిన్ శరీరంలో ప్రవేశించిన తర్వాత విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెందుతోంది. టమోటాలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉండడంతో పాడైపోయిన కురులకు తిరిగి జీవం పోయడంలో సహకరిస్తాయి. ఒక్కోసారి టమోటా గుజ్జుని హెయిర్ ప్యాక్‌లా వేసుకోవడంతో జుట్టు ప్రకాశవంతంగా కనిపిస్తోంది.
ఇక క్యారెట్ వెంట్రుకలను దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో విటమిన్ బీ7 పుష్కలంగా లభిస్తోంది. దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్యారట్‌తో తయారుచేసిన హెయిర్‌ప్యాక్‌ని వేసుకోవడంతో మంచి ఫలితం పొందవచ్చు. లైకోపిన్ అధికంగా ఉండే బీట్రూట్, సల్ఫర్ అధికంగా ఉండే వెల్లుల్లి రోజువారీ ఆహారంలో తీసుకోవడంతో కురుల ఎదుగుదలకు తోడ్పడుతోంది. కరివేపాకును జుట్టు రాలిపోవడాన్ని తగ్గించే సుగుణాలున్నాయి. దీంతో మనకు లభించే కెరోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేస్తోంది. పచ్చి బఠానీలో విటమిన్- సి ఎక్కువగా ఉంటుంది. గుమ్మడి, అవిసె గింజలు సైతం వెంట్రుకలు దృఢంగా తయారవడానికి ఉపయోగపడతాయి. వీటిని రోజూ ఆహారంగా తీసుకుంటే వెంట్రుకలు రాలడం తగ్గడమే కాకుండా దృఢంగా పెరుగుతాయి.