మళ్లీ పొడిగిస్తే మాది చిప్పబతుకే అంటున్న నటుడు

by Shyam |   ( Updated:2020-05-14 00:07:51.0  )
మళ్లీ పొడిగిస్తే మాది చిప్పబతుకే అంటున్న నటుడు
X

దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ర్టీ వాళ్లంతా ఇండ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్‌లు ఆగిపోవడంతో ఎక్కడా పనిలేక దాదాపు 50రోజులుగా కాలం వెల్లదీస్తున్నారు. లాక్‌డౌన్ మళ్లీ పొడిగిస్తే పేద ప్రజలే కాదు మా పరిస్థితి కూడా అంతే అని నటుడు బ్రహ్మాజీ సోషన్ మీడియాలో పోస్టు పెట్టాడు. ప్రస్తుతం అది తెగ వైరస్ అవుతుంది. 'లాక్‌డౌన్ ఇంకా పొడిగిస్తే మా పరిస్థితి ఇది..' అంటూ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. చేతిలో చిప్ప పట్టుకుని కూర్చుని ఉన్న బ్రహ్మాజీ పక్కన ఓ చిన్నపిల్లవాడు ఇద్దరి మధ్యలో ఓ కుక్క పిల్లతో కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసి కొందరు సరదాగా కామెంట్ చేస్తుండగా, మరికొందరు వాళ్లు పడుతున్న కష్టాలు చెప్పుకుంటూ స్పందిస్తున్నారు.

View this post on Instagram

Lockdown extend ayithe maa condition …

A post shared by Actor Brahmaji (@brahms25) on May 12, 2020 at 11:44pm PDT

Advertisement

Next Story