‘‘ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. ఆ ఎమ్మెల్యే భూకబ్జాల్లో బిజీ’’

by Shyam |
‘‘ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. ఆ ఎమ్మెల్యే భూకబ్జాల్లో బిజీ’’
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాత్రం భూ కబ్జాల్లో నిమగ్నమయ్యారని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఆదివారం ఒక ప్రటనలో తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రంగారెడ్డి బండ అనే ప్రభుత్వ క్వారీ గుంతలో గత వారం రోజులుగా ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అండదండలతో రాళ్లను తీసి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. భూకబ్జాలు, ఇతర అక్రమాలపై త్వరలోనే సాక్ష్యాలతో సహా బయటపెడతానని వెంకట్ తెలిపారు. ఒకవైపు ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వారిని కాపాడేందుకు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కనీస ప్రయత్నం చేయడంలేదని విమర్శించారు.



Next Story

Most Viewed