- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నాకు ఏదన్న జరిగితే ఆ ఎమ్మెల్యేదే బాధ్యత

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని సీఎం జగన్‌కు కడప జిల్లా వైసీపీ కార్యకర్త గుడిసె గోపాల క్రిష్ణ లేఖ రాశారు. గత ఎన్నికల్లో జమ్మల మడుగులో సుధీర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనను పక్కకు పెట్టారని పేర్కొన్నారు. కాగా మీకు లేఖ రాసినట్టు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి తెలిస్తే తనపై ఆయన అనుచరులతో దాడులు చేయిస్తారని లేఖలో రాశారు. తనకు ఏం జరిగినా దానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిదే బాధ్యత అని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Next Story