వడ్డీ రేట్లు తగ్గించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్!

by Harish |   ( Updated:2021-05-10 05:16:57.0  )
వడ్డీ రేట్లు తగ్గించిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. రూ. లక్ష లోపు ఉన్న డిపాజిట్లపై 4 శాతం, రూ. లక్ష నుంచి రూ. 10 లక్షల్లోపు సేవింగ్స్‌పై 4.5 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు 5 శాతం వడ్డీ అమలవుతుందని బ్యాంకు వివరించింది. ఈ వడ్డీ రెట్లు మే 1 నుంచి వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలానికి దీర్ఘకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వార్షిక ప్రాతిపదికన 2.75 శాతం నుంచి గరిష్ఠంగా 6 శాతం వరకు వడ్డీ అందించనున్నట్టు వివరించింది. సవరించిన వడ్డీ రేట్లు.. 7-14 రోజులకు 2.75 శాతం, 15-29 రోజులకు 3 శాతం, 30-45 రోజులకు 3.50 శాతం, 46-90 రోజులకు 4 శాతం, 91-180 రోజులకు 4.50 శాతం, 181 నుంచి ఏడాదికి 5.25 శాతం, 1-2 ఏళ్లకు 5.50 శాతం, 2-3 ఏళ్లకు 5.75 శాతం, 3-5 ఏళ్లకు 6 శాతం, 5-10 ఏళ్లకు 5.75 శాతం, 5 ఏళ్ల పన్ను ఆదా డిపాజిట్లపై 5.75 శాతంగా బ్యాంకు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed