- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటు వేసేందుకు గుర్తింపుకార్డు తప్పనిసరి
సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు ఓటరుకు గుర్తింపు కార్డు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు. ఉప ఎన్నికలో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు గుర్తింపునకు ఓటరు స్లిప్ ప్రామాణికం కాదని అన్నారు. ఓటర్ స్లిప్‌తో పాటు గుర్తింపునకు తన ఎపిక్ (ఫొటో ఓటర్ గుర్తింపు కార్డు)ను తీసుకురావాలని అన్నారు. ఎపిక్ కార్డు లేని ఓటర్లు వారి గుర్తింపును నిరూపించుకోవడం కోసం భారత్ ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. పాస్‌పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్స్ ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగసంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతో సహా జారీ చేసిన పాస్ పుస్తకాలు , పాన్ కార్డ్, NPR కింద RGI జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఎంజీఎన్ఆర్ఈజీఏ జారీ చేసిన ఉపాధి హామీ పత్రం ,ఆరోగ్యబీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్ కార్డ్ , ఫొటో జత చేసి ఉన్న పింఛన్ పత్రాలు, ఎం.పీ, ఎం.ఎల్.ఏ , ఎం.ఎల్.సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, ఆధార్ కార్డులలో ఏదైనా వెంట తీసుకురావాలన్నారు.