రాణించిన ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు

by  |
రాణించిన ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు
X

ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్‌(Domestic Equity Market)లో మంగళవారం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు(ICICI Bank Shares) గణనీయంగా లాభపడ్డాయి. దాదాపు 3శాతం ఎగబాకి రెండువారాల గరిష్ఠాన్ని(Maximum) నమోదు చేశాయి. ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ రూ.15,000 కోట్ల సమీకరణ కోసం వాటాల జారీని ప్రారంభించడం బ్యాంకు షేర్లు(Bank shares) పెరగడానికి దోహదపడింది. బీఎస్‌ఈ(BSE)లో ట్రేడింగ్(Trading) ప్రారంభమైన మొదటి సగం సెషన్‌(First Half Session)లో ఐసీఐసీఐ బ్యాంక్ సూచీ 2.90శాతం ఎగబాకి షేరు రూ.374.15కు చేరుకుంది.

అంతకుముందు రోజు ముగింపు 363.60గా ఉన్నది. బీఎస్‌ఈ, నిఫ్టీ(BSE, Nifty) ఉదయం సెషన్‌లో అత్యధిక లాభాలు(Highest profits) గడించిన సూచీల్లో ఐసీఐసీ‌ఐ బ్యాంకు షేర్లు(ICICI Bank Shares) ఉన్నాయి. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో షేర్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్‌(QIP) ఆధారంగా ఒక్కో షేర ధర రూ.351.36గా ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతిపాదించింది. సోమవారం ముగిసిన ధరలో రూ.3.37లను డిస్కౌంట్‌ (Discount)గా ప్రకటించింది.



Next Story

Most Viewed