ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు బ్యాడ్ న్యూస్…!

by  |
ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు బ్యాడ్ న్యూస్…!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ అందించింది. కరోనా నష్టాలను అధిగమించేందుకు పలు కాల పరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) రేట్లను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. 50 బేసిస్ పాయింట్ల వరకు కోత విధిస్తున్నట్లు పేర్కొంది. మే 11 నుంచి సవరించిన రేట్లు అమల్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.

ఐసీఐసీఐ బ్యాంక్ సవరించిన నిర్ణయంతో సంవత్సర కాలపరిమితి డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ అందుతుంది. ఏడాదిపైన కాలపరిమితి ఉన్న ఎఫ్‌డీలపై 5.7 శాతం నుంచి 5.75 శాతం మధ్య వడ్డీ ఇవ్వనుంది. అంతేకాకుండా, రుణరేట్ల(ఎమ్‌సీఎల్ఆర్)ను సైతం తగ్గించనుందనే సమాచారం వినిపిస్తోన్నది. ఇటీవల దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ సైతం ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల కోతను విధించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed