మీ ఆటగాళ్లపై కన్నేయండి : ఐసీసీ హెచ్చరిక

by Shyam |
మీ ఆటగాళ్లపై కన్నేయండి : ఐసీసీ హెచ్చరిక
X

దిశ, స్పోర్ట్స్: కరోనా లాక్‌డౌన్ కాలంలో ఆటగాళ్లందరూ ఇండ్లకే పరిమితమయ్యారని, దీన్ని ఆసరాగా తీసుకొని బుకీలు ఆటగాళ్లను పలుమార్గాల్లో సంప్రదిస్తున్నారని ఐసీసీ గుర్తించింది. ఐసీసీలోని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) కొన్ని రోజులుగా నిఘా పెట్టిన అనంతరం తాజాగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు లేఖ రాసింది. ఈ లేఖలో అన్ని జాతీయ బోర్డులకు హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఆయా దేశాల ఆటగాళ్లపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ కాలంలో ఆటగాళ్లు సోషల్ మీడియాలో చురుకుగా ఉండటంతో వారిని వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ మాధ్యమాల ద్వారా బుకీలు సంప్రదిస్తున్నారని చెప్పింది. అమెరికా మెన్స్ క్రికెట్ టీంకు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు సంప్రదించినట్లు ఏసీయూ తెలిపింది. ఒక ఆటగాడికి పూర్తి కిట్ స్పాన్సర్ చేస్తామని మాట ఇచ్చింది. అయితే, రెండో ఆటగాడికి ఏమి ఎరవేసిందనేది ఇంకా తెలియరాలేదు. అమెరికా ఆటగాళ్లపై క్రికెట్ బుకీలు ఎర వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20 లీగ్ సమయంలో కూడా బుకీలు అమెరికన్ ఆటగాళ్లను సంప్రదించారు. దీంతో ఐసీసీ వీరికి వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం బుకీలు చిన్న జట్ల క్రికెటర్లు, జూనియర్ ఆటగాళ్లను టార్గెట్ చేసిందని, వెంటనే ఆయా క్రికెట్ బోర్డులు వీరిపై నిఘా పెంచాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed