- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు వాయిదా
దిశ, స్పోర్ట్స్: కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా రెండు క్వాలిఫైయింగ్ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ప్రకటించింది. 2023 వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయింగ్ లీగ్ సెప్టెంబర్‌లో నమీబియాలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీలో నమీబియా, పాపువా న్యూగినియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు పోటీ పడనున్నాయి. ఆగస్టులో అండర్ -19 వరల్డ్ కప్ రీజినల్ క్వాలిఫైయిర్ డివిజన్ పోటీలు టాంజానియాలో జరగాల్సి ఉంది. ఆగస్టు 7 నుంచి 14 వరకు జరగాల్సిన ఈ పోటీల్లో బోట్సువానా, కెన్యా, మొజాంబిక్, రువాండా, సియెర్రా లియోనీ, టాంజానియా జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ రెండు ఈవెంట్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ ప్రకటించారు. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌ను వాయిదా వేయడమే కాకుండా, 2023 ఇండియాలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ను మార్చి నుంచి నవంబర్‌కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.