బాబర్ అజామ్‌కు ఐసీసీ అరుదైన గౌరవం.. టీమిండియాకు ఊహించని షాక్..!

by Shyam |
బాబర్ అజామ్‌కు ఐసీసీ అరుదైన గౌరవం.. టీమిండియాకు ఊహించని షాక్..!
X

దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌కు ఐసీసీ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఎంపిక చేసి మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ అజమ్‌ను కెప్టెన్‌గా నియమించింది. వరల్డ్ కప్‌లో బాబర్ అజమ్ (303) అత్యధిక పరుగులు నమోదు చేశాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ డేవిడ్ వార్నర్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసింది. అతడికి తోడుగా జాస్ బట్లర్‌ను మరో ఓపెనర్‌గా తీసుకున్నది. వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా అతడికే ఇచ్చింది. ఈ జట్టులో శ్రీలంకకు చెందిన హసరంగకు చోటు దక్కింది. అయితే టోర్నీ మొత్తం చక్కగా రాణించిన మహ్మద్ రిజ్వాన్‌కు చోటు దక్కలేదు. ఐసీసీ జట్టులో ఒక్క టీమ్ ఇండియా ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక బౌలింగ్‌లో సత్తా చాటిన షాహీన్ అఫ్రిదిని 12వ ఆటగాడిగా ఎంపిక చేసింది.

ఐసీసీ జట్టు..

డేవిడ్ వార్నర్, జాస్ బట్లర్ (వికెట్ కీపర్), బాబర్ అజామ్ (కెప్టెన్), ఏడెన్ మార్క్‌రమ్, మొయిన్ అలీ, వానిందు హసరంగ, అడమ్ జంపా, జోష్ హాజెల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, ఎన్రిక్ నోర్జే, షాహీన్ అఫ్రిది (12వ ఆటగాడు)

Advertisement

Next Story