- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

X
దిశ, ఇబ్రహీంపట్నం: మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత మస్కు నర్సింహ్మా కన్నుమూశారు. గత కొద్దిరోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి 12.35 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 2004 నుండి 2009 వరకు ఆయన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశారు.
ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు. నర్సింహ్మా మృతి వార్త విని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నర్సింహా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
Next Story