- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేయనున్న ఐబీఏ
దిశ, వెబ్‌డెస్క్: కంపెనీల రిజిస్ట్రార్ నుంచి లైసెన్స్ పొందిన భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) త్వరలో రూ. 6 వేల కోట్లతో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఐఆర్‌సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేసేందుకు ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. సంస్థ రిజిస్ట్రేషన్‌తో పాటు రూ. 100 కోట్ల ప్రారంభ మూలధనాన్ని ఉంచే ప్రక్రియ మార్గదర్శకాల ప్రకారం కొనసాగుతోందని, తదుపరి దశ ఆడిట్ జరుగుతోందని, అనంతరం ఆస్తి పునర్నిర్మాణ సంస్థకు లైసెన్స్ కోరుతూ ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రారంభ మూలధనం ఎనిమిది బ్యాంకుల నుంచి వస్తుందని, ఆర్‌బీఐ ఆమోదం పొందిన తర్వాత బ్యాడ్ బ్యాంక్ మూలధనం రూ. 6 వేల కోట్లకు వస్తరించనున్నట్టు తెలుస్తొంది. ఆర్‌బీఐ అనుమతి వచ్చిన అనంతరం ఈక్విటీ భాగస్వాములు, బోర్డు ఏర్పాటు జరుగుతుందని సంబంధిత వర్గాలు వివరించాయి. కాగా, బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు కోసం ఐబీఏ ఎన్ఐఆర్‌సీఎల్ కంపెనీ బోర్డు అమల్లోకి తెచ్చింది. ఎస్‌బీఐ నుంచి ఒత్తిడితో కూడా ఆస్తుల నిపుణులు పీ ఎం నాయర్‌ను ఎన్ఐఆర్‌సీఎల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది. ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ నాయర్, కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ అజిత్ కృష్ణన్ నాయర్ ఈ బోర్డులో డైరెక్టర్లుగా ఉన్నారు.