గిస్లైన్‌ మాక్స్‌ బాగుండాలని కోరుకుంటున్నా : ట్రంప్

by  |
గిస్లైన్‌ మాక్స్‌ బాగుండాలని కోరుకుంటున్నా : ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: గిస్లైన్‌ మాక్స్‌ బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం ఆయన కరోనా వైరస్‌ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసు విషయమై ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆ కేసులు సంబంధించిన విషయాన్ని పరిశీలంచలేదని.. కానీ, ఆమె బాగుండాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో ఎవరు దోషులుగా తేలుతారని విలేకరులు ప్రశ్నించారు. దీంతో ట్రంప్ మాట్లాడుతూ.. ఆ కేసు గురించి తనకు ఏమాత్రం తెలియదని.. తాను ఆ కేసును పరిశీలించడం లేదన్నారు. కానీ, తాను పామ్‌ బీచ్‌ ప్రాంతంలో నివాసం ఉన్నప్పటి నుంచి గిస్లైన్‌ మాక్స్‌వెల్‌ కూడా అదే బీచ్‌ సమీపంలో నివాసం ఉన్నట్లు తెలుసని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆమెను పలు సార్లు కలిసిన ట్రంప్ చెప్పారు. కాగా, వ్యాపారీ జెఫ్రీ ఎప్‌స్టీన్ కోసం మైనర్‌ బాలికల విక్రయానికి పాల్పడిన ఆరోపణలపై గిస్లైన్ మాక్స్వెల్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed