- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మద్దతు ధర’ రద్దయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం
ఛండీగడ్: మద్దతు ధర వ్యవస్థ రద్దయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ అన్నారు. హర్యానాలో కనీస మద్దతు ధర అమలును ఎప్పటికీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మద్దతు ధర వ్యవస్థను ఎవరైన రద్దు చేయాలని చూస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని, ఆ చట్టాలతో మద్దతు ధరకు ముప్పు ఏర్పడుతుందని పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు జరుగుతుండగానే హర్యానాలో ఐదు మున్సిపల్ కార్పరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో మూడు చోట్లా అధికార కూటమి పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలోనే రైతులకు కనీస మద్దతు ధరను హామీనిస్తూ సీఎం ఖట్టార్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు.
మా ఓటర్లు హాలీడేలో ఉన్నారు.. అందుకే
హర్యానా స్థానిక ఎన్నికల్లో పరాజయానికి కారణాలు వెల్లడిస్తూ తమ ఓటర్లు హాలీడేలో ఉండటం వల్ల బీజేపీ నష్టపోయిందని పార్టీ హర్యానా ప్రతినిధి సంజయ్ శర్మ వివరించారు. ‘డిసెంబర్ 25,26, 27 తేదీల్లో హాలీడేలున్నాయి. ఇయర్ ఎండింగ్‌లో హాలీడేలు వరుసగా కలిసి వస్తే చాలా మంది టూర్ వెళ్లడానికి ప్లాన్‌లు వేసుకుంటారు. కానీ, దురదృష్టవశాత్తు ఈ సారి బీజేపీ ఓట్ బ్యాంకుకు చెందినవారే అత్యధికులు హాలీడేకు వెళ్లారు’ అని వివరణ ఇచ్చారు.