- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఇప్పట్లో రిటైర్ కాను : షోయబ్ మాలిక్
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ స్పష్టం చేశాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాలిక్.. త్వరలోనే టీ20 ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారమని.. తాను ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నానని.. బ్యాటింగ్, బౌలింగ్ చేయగలిగే పరిస్థితుల్లో తానెందుకు రిటైర్ అవుతానని మాలిక్ అంటున్నాడు.
కోచ్ మిస్బా ఉల్ హక్ ఆ పదవిలో ఉన్నంత కాలం తనకు అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఆడే అవకాశం రాకపోవచ్చని మాలిక్ అన్నాడు. ఒక వేళ అవకాశం ఇచ్చినా తాను నెంబర్ 4 స్థానంలోనే ఆడతానని మాలిక్ స్పష్టం చేశాడు. కాగా గత కొన్ని రోజులుగా మాలిక్ పాకిస్తాన్ జట్టు మేనేజ్‌మెంట్‌పై విరుచుకపడుతున్నాడు. జట్టు యాజమాన్యం కెప్టెన్ బాబర్ అజమ్‌కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వడం లేదని మాలిక్ ఆరోపించాడు.