- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IT Return's :ఇక మీదట వాళ్లకు ఐటీ రిటర్న్ ఉండదట..
దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్ దాఖలు చేసే అంశంలో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) వృద్ధులకు ఊరటనిచ్చింది. 75 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్ దాఖ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో 75 ఏళ్లు దాటిన వారికి ఈ ఏడాది ఐటీ రిటర్నుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నుంచి పింఛను తీసుకునే వారు తమ పొదుపు ఖాతాలున్న బ్యాంకుల్లో ఇవ్వాల్సిన ఫారమ్‌తో పాటు, దానికవసరమైన నిబంధన్లను నోటిఫై చేసింది.
దీనికోసం ఐటీ శాఖలోని ఫారమ్ 12బీబీఏను పెన్షన్ తీసుకుంటున్న వారు తమ ఖాతా ఉన్న బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. పెన్షన్ ఖాతా ఉన్న అదే బ్యాంకులో వడ్డీపై మాత్రమే ఐటీఆర్ ఫైలింగ్ నుంచి మినహాయింపు అందుబాటులో ఉండనుంది. పెన్షన్ కాకుండా ఇతర మార్గాల్లో వస్తున్న ఆదాయంపై ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని ఐటీ శాఖ పేర్కొంది. అంతేకాకుండా, తాజా నోటిఫికేషన్‌లో 60 ఏళ్లు దాటిన వారిని సీనియర్ సిటిజన్లు గా 80 ఏళ్లు దాటిని వారిని సూపర్ సీనియర్ సిటిజన్‌గా పరిగణించారు. ఇదే సమయంలో ఆదాయం అందుకుంటూ ఐటీ రిటర్న్ దాఖలు చేయకపోతే జరిమానాతొ సహా అధిక టీడీఎస్ వర్తిస్తుందని సీబీడీటీ వెల్లడించింది.